Sachin Tendulkar Shoaib Akhtar sensational revelation after 16 years
mictv telugu

సచిన్‌ను చంపాలనుకున్నా.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

June 6, 2022

Sachin Tendulkar Shoaib Akhtar sensational revelation after 16 years

ఆటను ఆటగా తీసుకునే రోజులెప్పుడో పోయాయి. ఇండియా, పాక్ మధ్య క్రికెట్ అంటే యుద్ధానికన్నా ఎక్కువ బీభత్సంగా ఫీలవుతుంటారు అభిమానులు. ప్రేక్షకులే కాదు ఆటగాళ్లు కూడా ఉద్రేకంతో స్పందింస్తుంటారు. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ ఆఖ్తర్ తాజాగా బయటపెట్టిన పాత పగే దీనికి ఉదాహరణ.
2006 జనవరి 29 నాటి టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను చంపాలనుకున్నానని ఫాస్ట్ బౌలర్ షోయబ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

పాక్‌లో జరిగిన సిరీస్ లో రెండు మ్యాచ్‌లు డ్రా కా, మూడోది కీలకంగా మారడంతో రెండు జట్లూ హోరాహారీగా తలపడిన వైనాన్ని అతడు వివరించాడు.
‘ఈ సంగతి తొలిసారి చెబుతున్నాను. ఆ రోజు సచిన్‌ను చంపుదామనుకున్నాను. తీవ్రంగా గాయపర్చాలని అతని హెల్మెట్‌ను టార్గెట్ చేసుకున్నాను. నా బంతి వేగానికి చనిపోయాడని భావించాను. అతడు ఆ బంతిని కొట్టి తప్పించుకున్నాడు. తర్వాత కూడా చంపడానికి బంతి వేశాను’ అని షోయబ్ చెప్పాడు. క్రికెట్ అభిమానులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకునే 16 ఏళ్ల కిందటి ఆ సిరీస్‌ను పాక్ కైవసం చేసుకుంది.