నాకు రూ. 14 కోట్లు ఇప్పించండి: సచిన్ - MicTv.in - Telugu News
mictv telugu

నాకు రూ. 14 కోట్లు ఇప్పించండి: సచిన్

June 14, 2019

 

Sachin Tendulkar sues Australian cricket bat maker over 2 million dollars in royalties

ఆస్ట్రేలియాకు చెందిన ఓ బ్యాట్ల కంపెనీపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అక్కడి కోర్టులో దావా వేశారు. ఆస్ట్రేలియాకు చెందిన స్పార్టన్ స్పోర్ట్స్ ఇంటర్నేషన్ అనే సంస్థ తనకు రావాల్సిన 2 మిలియన్ డాలర్ల(14 కోట్లు) రాయల్టీ చెల్లించకుండా తన పేరును వాడుకుంటోందని సచిన్ కోర్టుకు తెలిపారు. ఆ కంపెనీ త‌న బ్యాట్ల‌పై స‌చిన్ లోగో, ఇమేజ్‌ను ముద్రించింది. స‌చిన్ బై స్పార్ట‌న్ అన్న ట్యాగ్‌లైన్‌తో ఆ కంపెనీ త‌న ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్న‌ది. ఇకపై స్పోర్ట్స్ ఉత్పత్తులకు తన పేరును వాడుకోవద్దని సచిన్ సూచించారు. సదరు కంపెనీ తనతో 2016లో ఒప్పందం చేసుకుందనీ.. అందులోని నిబంధనల ప్రకారం తాను విదేశాల్లో అనేక ప్రచార కార్యక్రామాల్లో పాల్గొన్నానని సచిన్ వివరించారు. రెండేళ్లైనా తనకు పైసా కూడా ఇవ్వకుండా కంపెనీ పట్టనట్టు వ్యవహరించింది.. 2018 వరకు తనకు రావాల్సిన రాయల్టీ చెల్లించాలని కంపెనీకి లెటర్ కూడా రాశానని తెలిపారు.

అయినా కంపెనీ స్పందించక పోవటంతో ఒప్పందం రద్దు చేసుకున్నానని.. ప్రచార కార్యక్రమాలకు తన పేరు ఉపయోగించవద్దంటూ సంస్థకి సూచించారు. కానీ, సచిన్ సూచనను సంస్థ పాటించకపోవడంతో సచిన్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. గిల్బ‌ర్ట్ టోబిన్ కోర్టు కేసును డీల్ చేస్తోంది. ఈ ఏడాది జూన్ 5వ తేదీన కేసును ఫైల్ చేశారు. కాగా, సచిన్ వేసిన దావాపై సదరు కంపెనీ ఇంతవరకు స్పందించలేదు.