కొడుకు కోసం సచిన్ కొత్త అవతారం.. కత్తెర చేతపట్టి - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకు కోసం సచిన్ కొత్త అవతారం.. కత్తెర చేతపట్టి

May 20, 2020

scnain

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొత్త అవతారం ఎత్తారు. తన ఇంటిలోనే హోం సెలూన్ ప్రారంభించి అందరిని ఆశ్చర్యపరిచాడు. బ్యాట్ పట్టిన చేతిలోకి కత్తర తీసుకొని చకచక కటింగ్ చేసేశాడు. తన కొడుకు అర్జున్ జుట్టు పెరగడంతో దాన్ని కత్తిరిస్తూ.. ఫొటోలకు ఫోజులిచ్చాడు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘ ఓ తండ్రి పిల్లల కోసం ఏదైనా చేయక తప్పదు’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చాడు. 

యావత్ ప్రపంచం దాటికి చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సెలూన్ షాపులు కూడా మూసివేయడంతో ఎవరికి వారు హెయిర్ కట్ చేసుకుంటున్నారు. ఈ బాటలోకి సచిన్ కూడా వచ్చారు. బార్బర్ అవతారం ఎత్తారు.  పిల్లలతో కలిసి ఆడుకోవడం, జిమ్ లో కసరత్తులు చేయడంతో పాటు హెయిర్ కట్ చేయడం కూడా ఇలాంటిదేనని ఆయన వ్యాఖ్యానించారు. హెయిర్ కట్ ఎలాగున్నా, నువ్వెప్పటికీ అందంగానే ఉంటావు అంటూ తన కొడుకునుద్దేశించి పేర్కొన్నారు. ఈ పనిలో తనకు సాయంగా ఉన్న కూతురు సారా టెండూల్కర్‌కు సచిన్ థాంక్స్ చెప్పాడు.