లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌కు మరో అరుదైన పురస్కారం - MicTv.in - Telugu News
mictv telugu

లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌కు మరో అరుదైన పురస్కారం

February 18, 2020

dvgbx

భారత క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్‌ను మరో అవార్డు వరించింది. గత రెండు దశాబ్దాలుగా అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన ఆటగాడిగా ఆయనకు గుర్తింపు లభించింది.ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డును సచిన్‌కు అందజేశారు. జర్మనీలోని బెర్లిన్‌లో లారెస్ అవార్డును ఆయన అందుకున్నాడు. భారత ఆటగాడికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

 తాను గెలిచిన ఈ ట్రోఫీ.. తానొక్కడితే కాదని..అందరిదని ఈ సందర్భంగా  సచిన్ అన్నారు. ఇక దశాబ్ధాల్లో అత్యుత్తమ స్పోర్ట్స్ మూవెంట్‌కు అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ అవార్డు కోసం పోటీ నిర్వహించారు. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 19 మంది ఆటగాళ్లు పోటీ పడ్డారు. వీరందరిని దాటుకొని సచిన్ తను రికార్డులతో అవార్డు కైవసం చేసుకున్నాడు. కాగా 2011లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ విజయం తరువాత సచిన్‌ను భారత ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకొని ఊరేగించిన విషయం తెలిసిందే. అంతటి ఆటగాడికి ఈ అరుదైన అవార్డు దక్కడంపై క్రికెట్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.