కన్సల్టెంట్ గా సచిన్ కావాలి..!
టీమిండియా బౌలింగ్, అసిస్టెంట్ కోచ్‌లను ఎంపిక చేసిన బీసీసీఐ.. ఇక టీమ్‌ను శ్రీలంకకు నంపే పనిలో ఉంది. ఈ టైమ్ లో సీఓఏతో మీటింగ్ సందర్భంగా సచిన్‌ను కన్సల్టెంట్‌గా రవిశాస్త్రి అడిగాడు. విదేశాల్లో కన్సల్టెంట్‌గా సచిన్ ఉంటే బాగుంటుందని శాస్త్రి అన్నాడు. అయితే విదేశాల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ద్రవిడ్‌ను నియమించిన సీఏసీలో సచినే సభ్యుడిగా ఉండటం హైలైట్. కానీ దీనిపై బోర్డు ఏ నిర్ణయం తీసుకోలేదు. కన్సల్టెంట్లపై నిర్ణయాన్ని వాయిదా వేశామని, ప్రస్తుతం టీమ్‌తోపాటు సంజయ్ బంగార్, భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్ శ్రీలంక వెళ్తారు. ఇక రవిశాస్త్రికి బీసీసీఐ ఏడాదికి రూ.7.5 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. ఇది గతంలో కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే కంటే కోటిన్నర ఎక్కువ. కామెంటేటర్, ఇతర కాంట్రాక్టులను వదులుకున్నందుకుగాను బోర్డు అతనికి ఈ అదనపు పరిహారం చెల్లించబోతోంది. అసిస్టెంట్ కోచ్ బంగార్ రూ.2.2 కోట్లు, భరత్ అరుణ్ రూ.2 కోట్లు ఇస్తోంది.