వావ్...సచిన్ రెమ్యునరేషన్ 35 కోట్లపైనే..! - MicTv.in - Telugu News
mictv telugu

వావ్…సచిన్ రెమ్యునరేషన్ 35 కోట్లపైనే..!

May 29, 2017

 

సచిన్‌: ఎ బిలియ‌న్స్ డ్రీమ్స్‌ కోసం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తీసుకున్న రెమ్యునరేషన్ పై బాలీవుడ్ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు రూ.35 కోట్లు తీసుకున్నాడట. కొందరైతే రూ.40 కోట్ల వరకు ఉండొచ్చంటున్నారు. కన్ ఫామ్ కాక‌పోయినా.. రూ.35 కోట్ల నుంచి రూ.38 కోట్లు ఇచ్చి ఉండొచ్చు అని ఈ సినిమా టీమ్‌లోని ఒకరు చెప్పడం హైలైట్. సచిన్ సినిమాకు మంచి టాకే వ‌చ్చినా.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం ఓపెనింగ్స్ లేవు. తొలి మూడు రోజుల్లో కేవ‌లం రూ.27 కోట్లు మాత్ర‌మే వసూలు చేసింది.