సడక్-2 పోస్టర్‌పై కేసు.. హిందువులు మనోభావాలు దెబ్బతినేలా ఉందని..  - MicTv.in - Telugu News
mictv telugu

సడక్-2 పోస్టర్‌పై కేసు.. హిందువులు మనోభావాలు దెబ్బతినేలా ఉందని.. 

July 4, 2020

Sadak-2.

బాలీవడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. మహేశ్ భట్, ఆలియా భట్‌ను టార్గెట్ చేస్తూ కొందరు ‘బాయ్‌కాట్ సడక్-2’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాకు మరో సెగ తగిలింది.  ‘స‌డ‌క్-2’ పోస్ట‌ర్ హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉందంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్ కోర్టులో కేసు నమోదైంది. హిందువులకు పవివత్రమైన మానస సరోవరాన్ని ఇందులో చూపారని.. రోడ్ టు లవ్ అని దాన్ని ప్రచారం చేస్తున్నారని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమా ద‌ర్శ‌కుడు మ‌హేశ్ భ‌ట్‌తో పాటు నిర్మాత‌ ముఖేశ్ భ‌ట్, న‌టి ఆలియా భ‌ట్‌పై సెక్ష‌న్ 120బీ, 295ఏ కింద కేసులు నమోదు అయ్యాయి. సికంద‌ర్‌పూర్‌కు చెందిన ఆచార్య‌చంద్ర కిషోర్ అనే వ్య‌క్తి ఈ కేసులు న‌మోదు చేశారు.

1991లో వచ్చిన ‘స‌డ‌క్’ సినిమాకు ఈ సినిమా సీక్వెల్‌గా వస్తోంది. సుమారు 20 ఏళ్ల తర్వాత మహేశ్ భట్ మళ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆయన కూతురు ఆలియానే ముఖ్య పాత్ర పోషిస్తోంది. పూజా భ‌ట్, సంజ‌య్ ‌ద‌త్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. మూడు రోజుల క్రితం విడుద‌లైన ఈ సినిమా పోస్టర్‌పై వివాదం రాజుకుంది.
కాగా, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తితో మ‌హేశ్ భ‌ట్ స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కూతురు ఆలియాతో మ‌హేశ్ భ‌ట్ తీస్తోన్న ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఆయ‌న‌పై నెటిజ‌న్లు విరుచుకుపడుతున్నారు.