1000 టన్నుల బంగారు నిధి.. ఆ సన్యాసి కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

1000 టన్నుల బంగారు నిధి.. ఆ సన్యాసి కన్నుమూత

May 13, 2020

Sadhu Shobhan Sarkar, saint passed away, Archaeological Survey of India,  gold treasure

ఒక్క మాటతో దేశాన్నంతా తన వైపుకు తిప్పుకుని, బంగారు ఆశలు కల్పించిన సన్యాసి కన్నుమూశాడు. పాడుబడిన రాజభవనంలో 1000 టన్నుల బంగారం ఉందని ప్రకటించిన శోభన్ సర్కార్ అనే వృద్ధుడు ఈ రోజు తెల్లారుజామున తన ఆశ్రమంలోనే చనిపోయారు. ఆయన భక్తులు కడచూపు చూసుకోడానికి పోటెత్తారు. లాక్ డౌన్ నిబంధనలను పక్కన పెట్టి ఆశ్రమంలోకి వచ్చేశారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా  దౌండియాఖేడా‌ గ్రామం ఆయన పుణ్యమా అని 2013లో వార్తలకెక్కింది. 

రాజారావు అనే స్థానిక పాలకుడు బ్రిటిష్ పాలకులతో పోరాడి ఓడిపోయారని, వారికి తన ఖజానా దొరకకుండా బంగారాన్ని పూడ్చిపెట్టారని బాబా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాడు. కేంద్రం కూడా ఆశతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ముందుకు నెట్టింది. అధికారులు వందలాది కూలీలతో తవ్వకాలు జరిపించారు. అదిగో పులి అంటే ఇదిగో తోకలా నెలన్నర పాటు తవ్వారు. కుండలు, మట్టిగాజులు వంటివి తప్పిస్తే అరతులం బంగారం కూడా దొరక్కలేదు. దీంతో తవ్వకాలను నిలిపేశారు. కానీ తవ్వకాలకు లక్షలు తగలేయాల్సి వచ్చింది. తవ్వకాలపై అప్పట్లో తీవ్ర విమర్శు కూడా వచ్చాయి. వెర్రిబాగుల వాళ్లకూడా ఇలాంటి కథలు చెప్తారని, గుంతలు తవ్వడానికి ప్రజాధనాన్ని ఖర్చు చేయడం సరికాదని మండిపడ్డారు.