కరోనా రాజకీయాల వేడిలో ‘ప్రగ్యా మిస్సింగ్’ పోస్టర్లు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా రాజకీయాల వేడిలో ‘ప్రగ్యా మిస్సింగ్’ పోస్టర్లు

May 29, 2020

Pragya Singh

బీజేపీ ఎంపీ సాథ్వి ప్రగ్యా సింగ్ ఠాగూర్ మిస్సింగ్ అంటూ మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇవాళ పోస్టర్లు వెలిశాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వీడియో కాల్ ద్వారా ఆమె ఓ మొబైల్ ఆసుపత్రి సేవలను ప్రారంభించినప్పటికీ ఈ వివాదం చల్లారలేదు. ఈ విషయమై బీజేపీ ప్రతినిధి ఉమాకాంత్ దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‌‌‌ఆమె మిస్సింగ్‌లో లేరు. కేన్సర్, కంటి చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్పప్పటికీ ఫోన్ ద్వారా వలస కార్మికుల సమస్యలపై ఆమె స్పందించారు. వలస కూలీలు, విద్యార్ధులు సహా అవసరం ఉన్న వారందరికీ సాయం అందేలా చూశారు’ అని దీక్షిత్ వెల్లడించారు.

ఇదే విషయమై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాహుల్ కొఠారీ సైతం స్పందించారు. తాను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరినట్టు ఇప్పటికే ఎంపీ వెల్లడించారని ఆయన తెలిపారు. ఇదిలావుండగా భోపాల్ సౌత్‌వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీసీ శర్మ ప్రగ్యా ”మిస్సింగ్” పోస్టర్లకు మద్దతు ఇచ్చారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఆమె ఎక్కడున్నారంటూ ప్రజలు అడగడంలో తప్పులేదని ఆయన సమర్థించారు.