కాషాయ అంబేడ్కర్.. యోగి సర్కారు మహిమ - MicTv.in - Telugu News
mictv telugu

కాషాయ అంబేడ్కర్.. యోగి సర్కారు మహిమ

April 9, 2018

ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేయిస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్న యూపీలోని బీజేపీ ప్రభుత్వం మరో తీవ్ర నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కాషాయ కోటు వేసుకున్నట్లు విగ్రహాన్ని రూపొందించి బదాయూ జిల్లాలోని దుగ్రయా గ్రామంలో సోమవారం ఆవిష్కరించింది.

ఈ విగ్రహం స్థానంలో గతంలో నీలి దుస్తులున్న అంబేడ్కర్ బొమ్మ ఉండేది. అగ్రవర్ణాల వారు దాన్ని విరగ్గొట్టడంతో కొత్త విగ్రహాన్ని ఆగ్రాలో తయారు చేయించి తీసుకొచ్చారు. బహుజన్ సమాజ్ వాదీ లోకల్ నేత సమక్షంలో దీన్ని ఆవిష్కరించారు. కాగా, దళిత వర్గాలకు చిహ్నమైన నీలిరంగులో కాకుండా హిందూమతానికి, బీజేపీకి చిహ్నమైన కాషాయం బట్టల్లో అంబేడ్కర్‌ను రూపొందించడం వెనుక కుట్ర ఉందని సమాజ్ వాదీ పార్టీ ఆరోపిస్తోంది. బీఆర్ అంబేడ్కర్ పేరుకు ఇకపై పూర్తిగా భీమ్ రాం రాంజీ అంబేడ్కర్ అని రికార్డుల్లో రాయాలని, పాత రికార్డుల్లోనూ మార్పులు చేయాని సీఎం యోగి సర్కారు ఇటీవల ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.