కారుపైకి ఎక్కిన డీసీఎం.. నలుగురికి గాయాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

కారుపైకి ఎక్కిన డీసీఎం.. నలుగురికి గాయాలు.. 

September 28, 2020

Sagar highway car dcm van collision

వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ కన్నుమిన్నూ కానకుండా ఏకంగా ఓ కారుపైకి ఎక్కేసి విధ్వంసం సృష్టించింది. నలుగురి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. హైదరాబాద్ వనస్థలిపురంలో కొన్ని గంటల కింద ఈ ప్రమాదం జరిగింది. నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. 

సాగర్ హైవేలోని ఇంజపూర్ సమీపంలో బ్రేకులు మొరాయించిన డీసీఎం వల్ల ఈ దారుణం జరిగింది. దేవరకొండ వైపు వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి బీఎన్ రెడ్డి నగర్ వైపు వెళ్తున్న కారు పైకి వెళ్లిపోయింది. పిడుగుపాటులా అంత భారీ వాహనంప పైన పడ్డంతో కారులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నలుగురు బాధితులకు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Sagar highway car dcm van collision