ఇద్దరు కోటీశ్వరులు....రెండు ఇండ్ల కహానీ...... - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్దరు కోటీశ్వరులు….రెండు ఇండ్ల కహానీ……

August 12, 2017

ఇది ఇద్దరు కోటీశ్వరుల కహాని. ఎంత సంపాదించావనేది కాదు అస్సలు  విషయం. దాన్నిఎట్లా కాపాడుకున్నావనేది అసలు పాయింట్. ఇక  దాన్ని  ఎవరి చేతిలో పెట్టావనేది కీ  పాయింట్.  ఇక్కడ ఇద్దరు కోటీశ్వరులు  రెండు రకాల కష్టాలను ఎదుర్కొంటున్నారు.  ఇద్దట్లో  ఒకరు ఇంటి కోసం, భుక్తి  కోసం పోరాడుతున్నారు. మరొకరు స్థలం కోసం సంపాదించిన ఆస్తుల కోసం ఆరాట పడుతున్నారు.

ఆ ఇద్దరు కోటీశ్వరుల గురించి కాస్త తెలుసుకుందాం. సహారా గ్రూపుకు చెందిన సుబ్రత్ రాయ్ పై కేసు  కావడం..  సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో స్పందించడం తెల్సిందే. జనం నుండి తీసుకున్న డబ్బుకు లెక్కా పత్రం లేకుండా పోయిందని, తనను నమ్మకుని పెట్టుబడులు పెట్టిన వారి గురించి పట్టించుకోవడం లేదనేదికిక్కడ అస్సలు పాయింట్. అందుకే ఆయన సంపాదించుకున్న వేల కోట్ల విలువ చేసే  అంబీ వ్యాలీని వేలం వేయాలని సుప్రీం కోర్టు అంటున్నది. వేలం పై స్టే విధించాలనే పటీషన్నూ  కోర్టు కొట్టేసింది. కోర్టుకు 15 వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అవి చెల్లించక పోవడంతో వ్యాలీని వేలం వేస్తామని కోర్టు అంటున్నది. పూణే సమీపంలో ఉన్న ఈ వ్యాలీ విలువ 39 వేల కోట్ల రూపాయలు ఉంటుందట.

ఇంతగనం   పోగేసిన సంపదను కాపాడుకునేందుకు ఆయన ఆరాపడుతున్నారు. అంతేకాదు ఏండ్ల తరబడి సంపాదించిన సొమ్ము కంటే జనంలో ఆయన పల్చన అయిందే ఎక్కువ. ఎన్ని కంపెనీలు పెట్టినా… ఎంత మందికి ఉద్యోగాలిచ్చినా…  పోగేసిన సంపదను ఎట్లా ఖర్చు పెట్టావు.. దాన్ని ఎట్లా వినియోగించావనే దాంట్లో ఈయన ఫెయిల్ అయినట్లుంది. అందుకే ఇజ్జత్ కచ్ర అయినా సంపద కూడా దక్కేట్లు లేదు.

ఇక మరో కోటీశ్వరుని ముచ్చటిది. ఈయన పేరు విజయ్ సింఘానియా. రేమాండ్ పేరుతో బ్రాండేడ్ వ్యాపారాన్ని నిర్మించిన రాజు. అయిన ఇప్పుడు  కనీసం అవసరాలు తీర్చుకునేందుకూడా ఇబ్బందులు పడుతున్నారు. తాను సంపాదించిన 33 అంతుస్తుల ఇంటిలో తనకూ వాటా కావాలని కోరుతున్నాడు. తన సంపాదించిన 1000 కోట్ల ఆస్తిలో తనకూ వాటా ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. తన కుమారుడు గౌతమ్ సింఘానియా తన ఆస్తిని గుంజుకుని తనకు ఏమీ ఇవ్వడం లేదని ఆవేదన  చెందుతున్నాడు. కోట్ల రూపాయలు సంపాదించి… దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఇప్పుడు తన కనీసం అసరాలు తీర్చుకునేందుకు కాసులు లేక కటకటలాడుతున్నాడు. సంపాదించిన సొమ్మును ఎవరికి ఇవ్వాలో, ఎంత, ఎట్లా ఇవ్వాలనే విషయంలో సరిగ్గా జడ్జ్ చేయలేక ఈయనీ తిప్పలు వచ్చినట్లుంది.

కేవలం సంపాదిస్తేనే సరిపోదు. ముందు భవిష్యత్తులో తమకంటూ ఇంత ఉండాలని…. సంపాదించిన దానికి లెక్కా పత్రం ఉండాలని.. అది మనదైనా.. మంది  సొమ్ముతో చేసే వ్యాపారం అయినా.  అన్ని లెక్క ప్రకారం ఉండాలి.  లెక్క తప్పితే అన్ని అన్ని ఇట్లాగే ఉంటాయి మరి. వ్యాపారంలో చూపించిన మెలవకులు జీవితానికి అప్లైయ్ చేయలేక పోయారి కోటీశ్వరులు కదా.