ఐదోసారి తండ్రయిన పాక్ మాజీ క్రికెటర్.. దారుణమైన ట్రోలింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఐదోసారి తండ్రయిన పాక్ మాజీ క్రికెటర్.. దారుణమైన ట్రోలింగ్

February 15, 2020

Sahid afridi.

పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఇంట్లో సందడి నెలకొంది. ఆయన ఐదోసారి అచ్చటగా తండ్రయ్యారు. ఆయన భార్య నదియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అఫ్రిది దంపతులకు ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఐదో బిడ్డ తమ కుంటుంబలోకి ప్రవేశించినట్లు ఆయన స్వయంగా ట్వీట్ చేసి, ఫొటో పెట్టారు. 

దీనిపై మిశ్రమ స్పందన లభిస్తోంది. పిల్లాపాపలతో కళకళలాడాలని దేవుడు అఫ్రిదీని దీవించారని కొందరు అభినందిస్తున్నారు. మరికొందరు తీవ్రమైన, దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ‘అఫ్రిది కేవలం మగపిల్లాడిని కనడానికే కుటుంబ నియంత్రణ చేయించుకోవడం లేదు. నీతులు చెప్పే పిల్లాడి ఆయన ఇంకో పదిమందిని కన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. ఇలా కంటూపోతే రేపు ఆయన భార్యతోపాటు కూతురు కూడా ప్రసవం కోసం ఒకేసారి ఆస్పత్రిలో చేరతారు. అఫ్రిది పాకిస్తాన్ కోసం తనింట్లోనే ఓ మహిళా క్రికెట్ జట్టును తయారు చేస్తున్నాడు..ఇప్పటికే పేదరికం ఆకలితో అల్లాడతున్న దేశానికి ఆయన కొత్త కానుక ఇచ్చాడు..’ అని ఇష్టమొచ్చినట్లు కామెంటుతున్నారు.