మహా‌సమాధికి వందేళ్లు.. సాయినాథునికి రూ.6 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

మహా‌సమాధికి వందేళ్లు.. సాయినాథునికి రూ.6 కోట్లు

October 22, 2018

సాయిబాబా మహాసమాధి అయి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. బాబాను దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి షిర్డీకి తరలివస్తున్నారు. దీంతో సాయి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మోక్షం కలిగించు దేవుడా.. అంటూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. అంతేకాదు  కులమతజాతి భేదాలు లేకుండా అందర్నీ ప్రేమించి, సన్మార్గం చూపిన దివ్యపురుషుడి కానుకల వర్షం కురిపిస్తున్నారు.

అక్టోబర్ 15వ తేదీకి సాయి సమాధి అయి 100 సంవత్సరాలు పుర్తయ్యింది. ఈ సందర్భంగా షిర్డీ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు బాబా హుండీ కానుకలు వేశారు. మూడు రోజుల్లోనే బాబా ఆలయంలోని హుండీలన్ని నిండిపోయాయి. సోమవారం ఆలయ కమిటీ సభ్యులు హుండీలోని కానుకలను లెక్కించారు. స్వామి హుండీలోని ఆదాయం ఎంతో తెలుసా? రూ. 6 కోట్లు. మన దేశంలో సాయిని ఎంత భక్తితో పూజిస్తారో ఈ లెక్కింపు చూస్తే తెలుస్తోంది.