sai dharam tej gave support to vishwak sen
mictv telugu

విశ్వక్‌సేన్‌కు మద్ధతిచ్చిన మెగా హీరో.. ఎమ్మెల్యేకు కౌంటర్

May 5, 2022

గత రెండ్రోజులుగా వివాదాస్పద రీతిలో పాపులర్ అయిన హీరో విశ్వక్ సేన్‌ను మెచ్చుకుంటూ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. పాత్ర కోసం ఆహార్యం మార్చుకున్న తీరు తనకు నచ్చిందంటూ ట్వీట్ చేశారు. సినిమా కథ, కథనాలు తనకు రిలేటెడ్‌గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హీరో విశ్వక్ సేన్ కౌంటర్ ఇచ్చారు. ‘నేనేం సరదాగా పిలవని పేరంటానికి పోలేదు. స్టూడియో దగ్గర నాకోసం వేచి చూసి పది నిమిషాలు గప్పాలు కొట్టిన వ్యక్తే, ఆ తర్వాత మీరు ఎవరిని అడిగి వచ్చారు అని అడిగాడు. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఎమ్మెల్యే గారూ, మీరు మాట్లాడిన మాటలను ఆశీర్వాదంగా తీసుకుంటున్నా. ఈ విషయంలో జనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. నిజం ఏంటన్నది వాళ్లకు తెలుసు కాబట్టే నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను వాడిన పదం ఆవేశంలో వచ్చిందే తప్ప కావాలని వాడలేదు. ఈ వివాదం తర్వాత ప్రజలు నా ఇంటిని వెతుక్కుంటూ నాకోసం వస్తున్నారు. అభిమానుల్లారా, నేను నిలబడ్డానంటే కేవలం మీవల్లే. ఏది ఏమైనా ఎవరిది వారికి ఇచ్చిపడేస్తా. తగ్గేదే లే’ అని అన్నారు.