సోలో బతుకే సో బెటర్.. ఇప్పట్లో పెళ్లి లేదన్న తేజ్ - MicTv.in - Telugu News
mictv telugu

సోలో బతుకే సో బెటర్.. ఇప్పట్లో పెళ్లి లేదన్న తేజ్

October 26, 2020

Sai Dharam Tej is not married now

ఈమధ్య అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘సోలో బ్ర‌‌తుకే సో బెట‌ర్’ సినిమాల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు యువతను ఆకర్షించడానికే తీశారు. పెళ్లి జీవితం కన్నా బ్యాచిలర్ లైఫే బెటర్ అన్నట్టుగా ఈ సినిమాల ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమాల్లో నటిస్తున్న హీరోలు కూడా ఆ పాత్రలనే పాలో అవుతున్నారా? అఖిల్ ఏమోగానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం ఇప్పట్లో పెళ్లీ గిల్లీ లేదంటున్నాడు. ‘నీ బ్యాచిల‌ర్ లైఫ్ ఇంకొన్ని రోజులే’ అంటూ ‘అక్టోబ‌ర్ 15న చిరంజీవి సాయికి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు చెప్తూ ట్వీట్‌ చేశారు. దీంతో మెగా ఇంట మ‌రో పెళ్లికి స‌ర్వం సిద్ధం అవుతోందంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకున్నారు.

అయితే ఈ వార్త‌ల‌ను సాయి ధ‌ర‌మ్ కొట్టిపారేశాడు. ‘మా ఇంట్లోవాళ్లు సంబంధాలు చూస్తామంటే చూసుకోమని చెప్పాను. అయితే మీడియావాళ్లే నా పెళ్లి వెన‌క ప‌డ్డారు. ప్ర‌స్తుతానికి పెళ్లంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక‌వేళ అమ్మాయి బాగుంద‌ని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేస్తే ఆలోచిస్తా’ అని సాయి తెలిపాడు. కాగా, గ‌తేడాది సాయి నటించిన ‘ప్ర‌తిరోజు పండ‌గే’ సినిమా హిట్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ‘సోలో బ్ర‌‌తుకే సో బెట‌ర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాగా, మొన్న‌టి లాక్‌డౌన్‌లో నిఖిల్‌, నితిన్‌, రానా వ‌రుస‌గా పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మ‌రికొంద‌రు హీరోలు కూడా బ్యాచ్‌ల‌ర్ లైఫ్‌కు ఎండ్ ‌కార్డ్ పెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి.