మాట నిలబెట్టుకున్న సాయిధరమ్ తేజ్.. వృద్ధాశ్రమం నిర్మాణం పూర్తి  - MicTv.in - Telugu News
mictv telugu

మాట నిలబెట్టుకున్న సాయిధరమ్ తేజ్.. వృద్ధాశ్రమం నిర్మాణం పూర్తి 

September 19, 2020

ngcn

ఎట్టకేలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. అసంపూర్తిగా ఉన్న వృద్ధాశ్రమం భవానాన్ని పూర్తిచేశాడు. 2019లో తన బర్త్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘విజయవాడలో ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులు నన్ను సోషల్ మీడియా ద్వారా సంప్రదించారు. అసంపూర్తిగా ఉన్న తమ బిల్డింగ్ నిర్మాణానికి సహాయం చేయాల్సిందిగా కోరారు. దాని నిర్మాణ బాధ్యతను తీసుకున్నాను’ అని చెప్పాడు. అన్న ప్రకారం ఆ భవన నిర్మాణాన్ని ఎట్టకేలకు పూర్తిచేశాడు. 

సింగ్ నగర్ కాలనీలోని ‘అమ్మ ప్రేమ ఆదరణ సేవ’ వృద్ధాశ్రమ నిర్మాణాన్ని తేజ్ తన టీమ్ ద్వారా పూర్తిచేశాడు. ఈ ఓల్డేజ్ హోమ్‌కు సంబంధించిన తాజా ఫోటోలను తేజ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతేకాకుండా ఇపుడు పూర్తి కాబడిన ఈ వృద్ధాశ్రమానికి ఒక సంవత్సరం పాటు ఆర్ధికంగా అండగా నిలుస్తానని తేజ్ మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తేజ్‌ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు. 
కాగా, మెగా అభిమానులు కూడా తన బర్త్ డేకి పెట్టే ఖర్చుని ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ఇవ్వాలని అప్పట్లో తేజ్ కోరగా.. మెగా అభిమానులు కూడా లక్ష రూపాయల సహాయం అందించారు.