తెలంగాణ పోలీసులు చాలా గ్రేట్ : సాయి పల్లవి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ పోలీసులు చాలా గ్రేట్ : సాయి పల్లవి

February 20, 2020

టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న మహిళా సాధికార సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న భద్రతను ఆమె ప్రస్తావించారు. పోలీసులు మహిళల రక్షణ కోసం చేస్తున్న పని గ్రేట్ అంటూ కితాబిచ్చారు. దేశంలోనే హైదరాబాద్‌లో ఉన్నంతగా మహిళ భద్రత మరెక్కడా లేదని చెప్పారు. 

ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మహిళలు, యువతులు చదువుకోవడానికి, ఉద్యోగానికి వెళ్లాలంటే చాలా భయపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. ఇటువంటి ఎన్నో చర్యల కోసం యువత కూడా పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో పాటు పలువురు  ప్రముఖులు కూడా పాల్గొని మహిళా సాధికారతపై చర్చించారు.