Sai Pallavi Dance Program at the University of Georgia while studying Medicine
mictv telugu

సాయిపల్లవిని ఇంతకుముందెప్పుడైనా ఇలా చూశారా..

May 31, 2022

Sai Pallavi Dance Program at the University of Georgia while studying Medicine

‘ఫిదా’ సినిమాతో పరిచయమై తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న సాయిపల్లవి… సినిమాల్లోకి రాకముందు డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. అంతకుముందు కొన్ని డాన్స్ షోలలో కూడా పార్టిసిపేట్ చేసింది. ఎంత గొప్ప డ్యాన్సర్ అయినా… స్క్రీన్ మీద నటించే విషయంలో తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐటమ్ సాంగ్స్ తనకు సూట్ అవ్వవు అంటూ చెప్పిన ఈ నేచురల్ బ్యూటీ… సినిమాల్లో గ్లామ‌ర్ రోల్స్‌ను కూడా చేయ‌న‌ని చెప్పేసింది. అయిన‌ప్ప‌టికీ ఆమె డ్యాన్స్‌, న‌ట‌న‌కు ఆమెకు వరుస ఆఫర్లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ఎంతో మంది ఫాలోవ‌ర్ల‌ను కూడా సంపాదించుకుంది.

చాలామంది అభిమానులు సినిమాల్లో ఆమె చేసే డ్యాన్స్‌ను చూసేందుకే వెళ్తుంటారని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. సాయిప‌ల్ల‌వి చేసే డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది. శ‌రీరాన్ని ఎటు ప‌డితే అటు విల్లులా వంచుతూ డ్యాన్స్ చేయ‌గ‌ల‌దు. సాయిప‌ల్ల‌వి జార్జియాలో మెడిసిన్ చ‌దువుతున్న‌ప్పుడు అక్క‌డి యూనివ‌ర్సిటీలో ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసింది. అందులో ఆమె చేసిన డ్యాన్స్‌ను చూస్తుంటే నిజంగా రెండు క‌ళ్లూ చాల‌డం లేదు. అంత‌లా ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఇక ఆమె డ్యాన్స్ చేసిన వీడియో పాత‌దే అయిన‌ప్ప‌టికీ దీన్ని చాలా మంది చూడ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియోను చూసేందుకు నెటిజ‌న్లు సైతం ఆస‌క్తిని కన‌బ‌రుస్తున్నారు.