అత్యాచారంపై సాయిపల్లవి పైర్.. బిడ్డను కనే అర్హత లేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

అత్యాచారంపై సాయిపల్లవి పైర్.. బిడ్డను కనే అర్హత లేదు..

July 3, 2020

Sai Pallavi

ఎన్ని కఠిన చట్టాలు తీసుకుని వచ్చిన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో ఏడేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచారమే ఇందుకు చక్కటి ఉదాహరణ. పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామంకి చెందిన జయప్రియ అనే ఏడేళ్ల బాలిక జూలై ఒకటో తేదీన అదృశ్యమైనది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు, జయప్రియ స్నేహితుల ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జనప్రియను ఊరు చివరన ఉన్న ముళ్ల పొదళ్లలో గుర్తించారు. పోస్ట్‌మార్టంలో చిన్నారిని అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. 

దీంతో నెటిజన్లు #JusticeForJayapriya అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై సినీనటి సాయి పల్లవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవజాతిపై విశ్వాసం నశిస్తుంది. స్వరము లేని వారికి సహాయపడటానికి ఇచ్చిన శక్తిని మనం దుర్వినియోగం చేస్తున్నాము. బలహీనులను కాపాడటానికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాము. ఎవరు బలహీనంగా కనిపిస్తే వారిపై మన అధికారాన్ని చూపిస్తున్నాం.. మనలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికి పిల్లలను చంపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ సాయి పల్లవి ట్వీట్ చేశారు.