టాలీవుడ్ ప్రముఖ నటి సాయి పల్లివికి తెలంగాణ హైకోర్ట్ ఊహించని షాక్ ఇచ్చింది. తనకు పోలీసులు పంపించిన నోటీసులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ, తెలంగాణ హైకోర్ట్‌ను సాయి పల్లవి ఆశ్రయించింది. దీంతో కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం గురువారం ఆమె వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ, తీర్పును వెలువరించింది.
వివరాల్లోకి వెళ్తే..గతకొన్ని రోజులక్రితం సాయి పల్లవి..కాశ్మీర్ ఫైల్స్ సినిమాతోపాటు, గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భజ్రంగ్ దళ్సభ్యుడు సుల్తాన్ బజార్ పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో, పోలీసులు.. సాయిపల్లవికి జూన్ 21వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలో విరాటపర్వం సినిమా ప్రచారంలో బీజీబీజీగా ఉన్న ఆమె.. తను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తానని, ఇది సమయం కాదంటూ సమాధానం చెప్పారు. సినిమా విడుదలైన మరుసటి రోజు ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియలో పోస్ట్ చేశారు.
అనంతరం పోలీసుల నోటీసులు రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాయి పల్లవి అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. దీంతో ఆమెకు ఊహించని షాక్ తగిలినట్లైంది.