‘ఫిదా’ సినిమాలో భానుమతిగా అందరి మనసు కొల్లగొట్టిన సాయిపల్లవి.. ఇప్పుడు ఇంకో కొత్త సినిమాతో అలరించబోతోంది. ‘కల్ఫీ’ అనే మళయాళ చిత్రాన్ని తెలుగులో “హేయ్ పిల్లగాడ”అనే పేరుతో విడుదల చేస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.ఆ టీజర్ లో ఉన్న సాయిపల్లవిని చూసి మళ్లీ అందరూ ఫిదా అవుతున్నారట. టీజర్ ఇంట్రెస్టింగ్ ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ‘ ఫిదా” సిన్మ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాలోని “హేయ్ పిల్లగాడ’’ పాటనే టైటిల్ గా పెట్టారు. ‘ఫిదా’ సిన్మతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి ఈ సినిమాతో ఎలా అలరించబోతుందో సూడాలె మరి.