తన సహజమైన అందంతో, అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే సాయిపల్లవి గురించి ఈ మధ్య సోషల్‌మీడియాలో చాలా రూమర్స్ వస్తున్నాయి. త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనుందని.. వార్తలు రాగా.. అవన్నీ రూమర్స్ అని తేల్చేసింది. కానీ వాస్తవాలను పరిశీలిస్తే.. గార్గి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు సాయి పల్లవి. కొత్త ప్రాజెక్టులను కూడా ఒప్పుకోలేదు. రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కించే చిత్రంలో అవకాశం వచ్చినా తిరస్కరించిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
న్యూ ఇయర్ వేళ మిగతా వారికి భిన్నంగా పుట్టపర్తిలో కనపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది సాయిపల్లవి. సాంప్రదాయంగా చీరలో సాధారణ భక్తుల్లాగే వచ్చి అందరి మధ్యలో కూర్చొని పుట్టపర్తి సాయిబాబా దైవ చింతనలో తన నూతన సంవత్సర మొదటి రోజుని గడిపింది. తాజాగా ఎత్తియమ్మన్ మాత టెంపుల్ లో దర్శనమిచ్చింది సాయి పల్లవి. తమిళనాడులో కట్టుపాక్కం లోని అమ్మన్ నగర్ లోని ఎత్తియమ్మన్ టెంపుల్ లో అక్కడ సంప్రదాయ వస్త్రాలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నది. ఆమె వెంట తన చెల్లెలు కూడా ఫోటోలో ఉన్నది. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ కావడంతో సాయి పల్లవి సినిమాలు ఒప్పుకోకుండా…ఇలా గుళ్లు, గోపురాలు తిరుగుతుందేంటని కామెంట్లు పెడుతున్నారు.