Sai Pallavi recalls being beaten by parents after they found her love letter in class 7
mictv telugu

సెవెన్త్ క్లాస్‌లో ఒకతనికి లవ్ లెటర్ ఇచ్చి, తన్నించుకున్నా.. సాయిపల్లవి..

July 11, 2022

Sai Pallavi recalls being beaten by parents after they found her love letter in class 7

విరాట ప‌ర్వం సినిమాతో పవర్‌ఫుల్ హీరోయిన్‌గా మరింత క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు ‘గార్గి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లవ్ మ్యాటర్స్ రివీల్ చేసింది. బిగ్ బాస్ ఫేం గంగవ్వ నిర్వహిస్తున్న విలేజ్ షో అనే టాక్ షోలో హీరో దగ్గుబాటి రానాతో కలసి సాయి ప‌ల్ల‌వి తన బాల్యంలో జరిగిన ఓ సంఘటనను ప్రస్తావించింది. విరాట ప‌ర్వంలో ర‌వ‌న్న పాత్ర‌కు నువ్వు ల‌వ్ లెట‌ర్ రాశావు.. మరి నిజ జీవితంలో అలాంటిది ఏమైనా ఉందా అని గంగ‌వ్వ ప్రశ్నించడంతో సాయి పల్లవి ఓపెన్ గా మాట్లాడింది. తాను ఏడ‌వ త‌ర‌గ‌తి చదివే రోజుల్లో ఓ అబ్బాయిపై ఇష్టంతో లవ్ లెటర్ రాశానని చెప్పుకొచ్చింది. అయితే అది ఇంట్లో తెలియడంతో తనను పేరెంట్స్ బాగా కొట్టారని చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ అయింది.

ఇక నటిగా విరాటపర్వం తనకు సంతృప్తినిచ్చిందని తెలిపింది సాయిపల్లవి. ప్రేమ, కోపం, దు:ఖం అన్ని రకాల ఎమోషన్స్ పండించే పాత్రలు అరుదుగా దొరుకుతాయని, ఆ అవకాశం విరాటపర్వం సినిమాతో దక్కిందని పేర్కొంది. గతంలో తాను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా వెన్నెల పాత్ర సాగిందని, సినిమాల్ని అంగీకరించే ముందు తాను ఎలాంటి ఆశలు పెట్టుకోనని చెప్పింది. ఇక రాబోయే చిత్రం.. గార్గి గౌతమ్‌ రామచంద్రన్‌ డైరెక్షన్‌లో లేడీ ఓరియెంటెడ్‌‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాయి పల్లవి ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలు, ట్రైలర్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.