రూ. కోటి ఆఫర్ వదులుకున్న సాయిపల్లవి.. ఈసారి బట్టల యాడ్.. - MicTv.in - Telugu News
mictv telugu

రూ. కోటి ఆఫర్ వదులుకున్న సాయిపల్లవి.. ఈసారి బట్టల యాడ్..

November 19, 2019

మాంచి స్వింగులో ఉండగానే వచ్చే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని క్యాష్ చేసుకోవాలని సినిమా రంగంలో చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ, కొందరు మాత్రమే వచ్చిన ప్రతీ అవకాశాన్ని అస్సలు ఒప్పుకోరు. కథ నచ్చాలి.. అందులో తమ పాత్ర నచ్చాలి అని చూసుకుంటారు. అలా ఆచితూచి, రాశి కన్నా వాసి ముఖ్యం అని భావించి సినిమాలు చేసుకుపోతుంటారు. అలాంటివారే స్టార్స్ అవుతారేమో. అయితే ఓ నటి మాత్రం సినిమాలే కాదు యాడ్ కూడా నచ్చక కోటి రూపాయల ఆఫర్‌ను చల్లగా తిరస్కరించింది. 

Sai Pallavi.

మన సినిమా స్టార్స్ యాడ్స్‌లో నటించేందుకు ఎంతగా ఆసక్తి చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వచ్చే యాడ్స్‌లో నటించేందుకు క్రేజీ స్టార్స్‌తో పాటు అప్‌కమింగ్ నటులు కూడా తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే వారందరికీ తాను భిన్నం అని చెబుతోంది వర్థమాన నటి సాయిపల్లవి. తాను చేసే చిన్న పని అయినా బాగుండాలని కోరుకోవడంలో తప్పులేదని సాయిపల్లవి కారణం చెబుతోంది. ఇంతకీ ఈ ఫిదా పిల్ల వదులుకున్న ఆ ఆఫర్ ఏంటంటే.. ఓ పెద్ద వస్త్ర కంపెనీ నుంచి ఏడాది పాటు ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని ఆఫర్ వచ్చింది. అందుకోసం కోటి రూపాయలు కూడా ఇస్తామన్నారు. అయినా ఆమె ఒప్పుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినబడుతోంది. తనకు నచ్చని కథలను ఏ మాత్రం ఒప్పుకోని మనస్తత్వం ఉన్న సాయిపల్లవి… యాడ్స్ విషయంలో తాను ఇలాగే వ్యవహరిస్తానని మరోసారి క్లారిటీ ఇచ్చింది హైబ్రిడ్ పిల్ల. ప్రస్తుతం సాయి పల్లవి వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ‘విరాటపర్వం’, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన మరో సినిమాలో నటిస్తోంది.