ఫిదా జేసిన సాయి పల్లవి ! - MicTv.in - Telugu News
mictv telugu

ఫిదా జేసిన సాయి పల్లవి !

July 24, 2017

అచ్చం తెలంగాణ పిల్లగా భానుమతి పాత్రలో మెరిసి ‘ ఫిదా ’ చేసింది సాయిపల్లవి. ఇప్పుడు ఎవ్వరి నోటా విన్నా సాయిపల్లవి పేరే వినబడుతోంది. తుంటరి పిల్లగా మస్తు అల్లరి చేసింది సినిమా మొత్తంల. ఫిదా సినిమాకు సెంటరాఫ్ అట్రక్షన్ సాయి పల్లవే. మన పక్కింటి పిల్ల లెక్క అప్పుడే ఫ్యాన్స్ ఫాలోయింగును ఏర్పరుచుకున్నది. శేఖర్ కమ్ముల సాయి పల్లవిని ఎంచుకోవడం గుడ్ సెలెక్షన్ అంటున్నారు. మళయాళం ‘ ప్రేమమ్ ’ సినిమాలో మెరిసిన సాయిపల్లవికి తెలుగులో ‘ ఫిదా ’ బోణీ సినిమానే అయినా హయ్యెస్ట్ ఓపనింగును, జబర్దస్త్ బోణీని ఇచ్చింది.

‘ రెండు కులాలు రెండు మతాలు, వన్ పీస్, హైబ్రిడ్ పిల్ల ’ అంటూ భానుమతిగా సాయిపల్లవి పలికిన తెలంగాణ మాటలు, అల్లరి ఆహా.. స్క్రీనంతా తానుగా హంగామా చేసింది. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొని క్యారెక్టర్ ను పండించింది. క్యూట్ గా చాలా బాగా చేసిందని అంటున్నారు. అప్పుడే దిల్ రాజు నెక్ట్స్ మూవీలో నానీ సరసన ఆఫర్ కొట్టేసింది. ఇంకో రెండు బిగ్ బ్యానర్ల నుండి ఆఫర్లు ఆమె గుమ్మం ముందు పడిగాపులు గాస్తున్నయట. తమిళంలోనూ ఒక సినిమా ఒప్పుకుందట. టాప్ హీరోయిన్ గా ఎదిగే లక్షణాలు మస్తున్నయి సాయిపల్లవికి అంటున్నారు ఆమె ఫ్యాన్స్ !