Sai Pallavi starrer Gargi trailer released
mictv telugu

న్యాయం కోసం సాయిపల్లవి పోరాటం.. గార్గి ట్రైలర్ విడుదల

July 7, 2022

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి తాజాగా నటిస్తున్న గార్గి చిత్రం ట్రైలర్ గురువారం విడుదలయింది. గౌతమ్ రామచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలరును తెలుగులో రానా, నానిలు తమిళంలో సూర్య, ఆర్య, అనిరుధ్, లోకేష్ కనకరాజ్‌లు విడుదల చేశారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేసే పాత్రలో సాయిపల్లవి నటన ఆకట్టుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాలో సంభాషణలు నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పోలీసులు, కోర్టులు, మీడియా హడావిడి సినిమాలో కనిపిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా సమర్పిస్తున్నారు. కాగా, ఇటీవలే సాయిపల్లవి విరాటపర్వం చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సమయంలో పరిచయమైన రానా టాలీవుడ్‌లో తన బెస్ట్ ఫ్రెండ్ర్‌లలో ఒకరని సాయిపల్లవి ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పింది. ఇప్పుడు గార్గి చిత్రాన్ని రానానే సమర్పిస్తుండడం విశేషం.