సినిమాలకు స్వస్తి.. సాయిపల్లవి సంచలన నిర్ణయం ? - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాలకు స్వస్తి.. సాయిపల్లవి సంచలన నిర్ణయం ?

November 27, 2022

సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అంటారు. మిగతా కథానాయికలకు భిన్నంగా గ్లామర్ పాత్రల్లో కాకుండా ట్రెడిషినల్ పాత్రల్లో నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటుంది. అయితే తాజాగా సినిమాలకు సాయిపల్లవి గుడ్ బై చెప్పనుందని వార్తలు వస్తున్నాయి.విరాటపర్వం, గార్గి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి గత కొంత కాలంగా ఎలాంటి సినిమాలను అంగీకరించలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయి పల్లవి సినిమాల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే సాయి పల్లవి త్వరలో పెళ్లి చేసుకోబోతోందని, అందుకే ఆమె కొత్త సినిమాలను అంగీకరించడం లేదని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సాయి పల్లవి స్పష్టం చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ వార్త సద్దుమణిగింది. అయితే తాజాగా సాయి పల్లవి మళ్లీ సినిమాలకు దూరంగా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనికి మరో కారణం కూడా ఉంది. సాయి పల్లవి డాక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. జార్జియాలో మెడిసిన్ చదివిన సాయి పల్లవి ఇండియా వచ్చిన తర్వాత నటిగా మారింది. ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఇప్పుడు తాను చదివిన వైద్య వృత్తికి న్యాయం చేయాలని.. అందుకే కోయంబత్తూరులో సొంత ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి, ఆమె చెల్లెలు పూజ కలిసి ఈ ఆసుపత్రిని చూసుకోబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

ఇదికూడా చదవండి : పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు