పవన్ కళ్యాణ్ సరసన సాయి పల్లవి! - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కళ్యాణ్ సరసన సాయి పల్లవి!

October 29, 2020

Pawan Kalyan

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తి కాకుండానే పవన్ కళ్యాణ్ దర్శకులు క్రిష్,‌ సురేందర్ రెడ్డి, హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా ఈరోజు విజయదశమి పండుగ సందర్భంగా పవన్ కల్యాణ్ మరో సినిమాను అధికారికంగా ప్రకటించారు. పవన్ త్వరలో సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో నటించనున్నారు. 

ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కు ఇది రీమేక్‌గా రూపొందనుందని సమాచారం‌. దీంతో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. దీనికి ‘బిల్లా రంగా’ టైటిల్ ప్రచారంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సాయిపల్లవి నటించనున్నట్లు తెలుస్తోంది.  దీనిపై యూనిట్ అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సాగర్ కే చంద్ర గతంలో ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి తమన్‌ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రసాద్‌ మూరెళ్ల కెమెరా వర్క్ చేస్తున్నారు.