విరాటపర్వం తర్వాత న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి నటించిన చిత్రం గార్గి. కోర్టు డ్రామా నేపథ్యంలో తీసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కోర్డు డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 15 థియేటర్లలో విడుదలైంది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. అనుకోకుండా అత్యాచారం కేసులో ఇరుక్కున్న తండ్రిని కాపాడుకునే మధ్య తరగతి యువతి పాత్రలో వన్ ఉమెన్ షో గా సాయిపల్లవి నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎవరు ఊహించని క్లైమాక్స్ తో అందరిని ఆకట్టుకున్న “గార్గి” ఈ నెల 12 నుండి సోనీLIV లో స్ట్రీమ్ అవుతుంది.#GargiOnSonyLIV #SonyLIV #Gargi pic.twitter.com/82SXDYezGH
— SonyLIV (@SonyLIV) August 3, 2022
తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ చిత్రం ‘సోనీలివ్’లో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆకట్టుకునే కంటెంట్ ఉండడంతో గార్గి సినిమాను తెలుగులో ఎస్పీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి విడుదల చేశాడు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్. ఎస్. శివాజీ, కాళీ వెంకట్, కలైమణి శరవణన్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు.