Sai Pallavi's shocking comments on dance competitions
mictv telugu

డ్యాన్స్ పోటీలపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు

November 5, 2022

నటి సాయిపల్లవి టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే డ్యాన్స్ షోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. దక్షిణాదిలో మూడు భాషల్లో రాణిస్తున్న సాయిపల్లవి మంచి డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. వైద్య విద్య చదివిన తర్వాత ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అంతకు ముందు ఆమె పలు డ్యాన్స్ కాంపిటీషన్లలో పాల్గొంది. ఈటీవీలో ప్రసారమైన ఓ పోటీలో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. ఆ సమయంలోనే తమిళంలో విజయ్ టీవీలో ప్రసారమైన ఉంగళిల్ యార్ ఆడుత్త ప్రభుదేవా (మీలో తర్వాతి ప్రభుదేవా ఎవరు) అనే పోటీలో సాయి పల్లవి పాల్గొంది. అయితే ఆమెకు ద్వితీయ స్థానం రావడంతో అప్పట్లో చాలా బాధపడింది. ఫస్ట్ ప్రైజ్ రాకపోవడంతో ఇప్పుడు ఆ షోలపై వివాదాస్పద కామెంట్లు చేసింది.

తనకు ఫస్ట్ ప్రైజ్ రాకపోవడానికి కారణం ధన బలమేనని ఆరోపించింది. ఇటీవల జరిగిన ఓ భేటీలో ఆమె మాట్లాడుతూ.. డ్యాన్స్ పోటీల్లో ప్రతిభకు గౌరవం లేదని కుండ బద్దలు కొట్టింది. టీవీ చానెళ్లలో డబ్బుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని విమర్శించింది. లేకపోతే ప్రముఖుల వారసులకు అలాంటి మర్యాద ఇస్తారని, అందుకే తనకలాంటి పోటీలంటే ఇష్టం లేదని ఇంకా చెప్పాలంటే అసహ్యం అంటూ మండిపడింది. ఇదిలా ఉంటే మారి 2 సినిమాలో ప్రభుదేవా డైరెక్షన్‌లో ధనుష్‌తో కలిసి రౌడీ బేబీ అనే డ్యాన్స్‌కి ప్రాధాన్యమున్న పాటలో సాయిపల్లవి నర్తించింది. ఇందులో ఆమె డ్యాన్స్‌కి ఫిదా అయిపోయారు. దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.