ఏపీలో ఆగని అపచారాలు.. సాయిబాబా విగ్రహం ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఆగని అపచారాలు.. సాయిబాబా విగ్రహం ధ్వంసం

September 16, 2020

Saibaba statute destroyed in Vijayawada nidamanoor

ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ఆలయాలే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. కఠినంగా శిక్షిస్తామని, ఆలయాల్లో కెమెరాలు  ఏర్పాటు చేయించి నిఘా పెడుతున్నామని పోలీసులు చెబుతున్నా వాస్తవం మాత్రం భిన్నంగానే ఉంది. అంతర్వేది రథం దగ్ధం, పలు చోట్ల హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం, తాజాగా విజయవాడ కనకదుర్గ రథంలోని సింహాల విగ్రహాలు మాయం కావడం నేపథ్యంలో ఈసారి అన్నిమతాల వారూ కొలిచే సాయిబాబాను దుండగులు టార్గెట్ చేసుకున్నారు. 

విజయవాడలోని నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు. ఆలయం ద్వారం వద్ద ఉన్న విగ్రహం తలను,  కాలును వేరు చేశారు. నిన్న అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. స్థానికులు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.  పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ సురేశ్ రెడ్డి పగలిపోయిన విగ్రహాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీంచి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.