ద్యావుడా.. సాయిబాబానూ వదలని వైసీపీ రంగులు.. - MicTv.in - Telugu News
mictv telugu

ద్యావుడా.. సాయిబాబానూ వదలని వైసీపీ రంగులు..

November 29, 2019

జాతీయ జెండా, జాతిపతి, బర్రెలు, శ్మశానాలు, గుళ్లుగోపురాలు.. కాదేదీ వైఎస్సార్ కాంగ్రెస్ రంగులకు అనర్హం. ఏపీ అధికార పార్టీ వైకాపా కార్యకర్తలు పచ్చతమ్ముళ్లను మించిపోతున్నారు. కనిపించిన దానికల్లా పుసుక్కున పూసేస్తున్నారు. 

Saibaba.

విజయనగరం జిల్లాలో గాంధీ దిమ్మెకు జగన్ పార్టీ రంగుల పూత ఉదంతాన్ని మరవక ముందే అదే జిల్లా చీపురపల్లిలో మరో అపచారం జరిగింది. అక్కడి సాయిబాబా ఆలయంలో విగ్రహానికి వైకాపా జెండాను అలంకరించారు. భక్తులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో తర్వాత తేసేశారు. పొరపాటు వల్ల ఇలా జరిగిందని, ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాబోమయని ఆలయ పూజారులు చెప్పుకొచ్చారు.