నిందితుడు రాజు కోసం 500 మంది పోలీసుల గాలింపు.. - MicTv.in - Telugu News
mictv telugu

నిందితుడు రాజు కోసం 500 మంది పోలీసుల గాలింపు..

September 15, 2021

Saidabad incident—500 policemen landed in the field

సైదాబాద్  హత్యాచార కేసు నిందితుడు పల్లంకొండ రాజు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది పోలీసు యంత్రాంగం. దాదాపు 500 మంది పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

అఘాయిత్యం జరిగి రోజులు గడుస్తున్నా రాజు ఆచూకి ఇంకా లభించలేదు. పోలీసులకు చిక్కలేదు.దీంతో పోలీసులపై ఒత్తిడి పెరగసాగింది.దీంతో దాదాపు 500 మంది పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి  గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. నిర్మానుష్య ప్రదేశాల్లో , వైన్స్‌ల వద్ద,పర్మిట్ రూమ్స్ వద్ద,కల్లు కాంపౌండ్‌లలో, బస్ స్టేషన్,రైల్వే స్టేషన్‌లలో,ఫుట్‌పాత్‌ల పైనా,అడ్డా కూలీల వద్ద ఇలా ప్రతి చోట నిందితుని  ఫోటో అతికించి వెదుకుతూనే ఉన్నారు. నగరంలో ప్రతి చోటు వదలకుండా ముమ్మరంగా గాలిస్తూనే ఉన్నారు. నగరంలోని వివిధ కూడళ్ళలో ఏర్పటు చేసిన  సీసీ కెమెరాల  దృశ్యాలను కూడ పరిశీలిస్తున్నారు.

సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారిని  పాశవికంగా అత్యాచారం చేసి,హత్య చేసిన నిందితుడు రాజు తప్పించుకోవడానికి ఎవరైనా బస్తీవాసులు సహాయం చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రజల మద్ధతు కోరుతున్నారు. నిందితుడి ఆనవాళ్ళన కూడా విడుదల చేశారు.