సైదాబాద్ నిందితుని ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

సైదాబాద్ నిందితుని ఆత్మహత్య

September 16, 2021

సైదాబాద్ హత్యచార కేసులో నిందితుడిగా ఉన్న పల్లంకొండ రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సైదాబాద్ ,సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని ఆరేళ్ళ చినారిని పాశవికంగా అత్యాచారం, హత్య చేసిన నిందితుడు రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొన్ని రోజుల నుండి పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్న రాజు ఎట్టకేలకు రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు.

వరంగల్‌ – ఘట్‌కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడు రాజు కోసం గత కొన్ని రోజులుగా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కితే మరణశిక్ష పడుతుందనే భయాందోళనతో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.