Home > Featured > ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. తలపై 42 కొబ్బరికాయలు నాన్‌చాకుతో పగులగొట్టాడు

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. తలపై 42 కొబ్బరికాయలు నాన్‌చాకుతో పగులగొట్టాడు

చేత్తో కొబ్బరికాయను పగులగొట్టడమంటేనే కొందరికి చేతులు నొప్పెడతాయి. అలాంటిది తలపై 42 కొబ్బరికాయలు పెట్టి, వాటిని నాన్ చాకుతో నిమిషంలో పగులగొట్టడమంటే మాటలా. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా లేదా నాన్ చాకు కొద్దిగా పక్కకు జరిగినా తల పగలడం ఖాయం. అసలే కొబ్బరికాయ గుండ్రంగా ఉంటుంది. కొట్టినప్పుడు పక్కకు జారిపోయే అవకాశాలు ఎక్కువ.

కానీ, ఇంత కష్టమైన ఫీట్‌ను కర్ణాటకకు చెందిన మార్షల్ ఆర్ట్ నిపుణుడు కేవీ సైదలవి చాలా ఈజీగా చేసేశాడు. అంతేకాక, ఈ క్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. గిన్నీస్ బుక్ వారు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. సైదలవి చుట్టూ ఆరుగురు కూర్చుని ఉండగా, వారి తలపై పీచు ఒలిచిన కొబ్బరికాయలు ఉంచుతారు. సైదలవి వరుస పెట్టి నాన్ చాకుతో వాటిని పగులగొట్టుకుంటూ వెళ్తారు. చుట్టూ కూర్చున్న ఆరుగురు తమ వంతు రాగానే కొబ్బరికాయను తమ తలపై పెట్టుకొని రెడీగా ఉంటారు. ఇలా నిమిషంలో 42 కొబ్బరికాయలు కొట్టడం అబ్బురపరుస్తుంది. నేలపై ఉన్న కోడిగుడ్లను పగులగొట్టినట్టు సైదలవి కొబ్బరికాయలను కొట్టడం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇంతేకాక, ఈ వీడియోలో ఆయన చేసిన పలు ఫీట్ల దృష్యాలు ఉన్నాయి. కొందరు నెటిజన్లు మాత్రం మాస్టరును కాక, నెత్తిపై కొబ్బరికాయలు పెట్టించుకున్న వారి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.

Updated : 3 Oct 2022 7:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top