సెలబ్రిటీలకు ఫ్యాన్సే కాదు మీడియా తాకిడి అధికంగానే ఉంటుంది. తిన్నా ,పడుకున్నా, బయటికి వచ్చినా ఏదైనా షోలో పాల్గొన్నా ఫోటోగ్రాఫర్లు వారి వెంటపడి మరీ తమ కెమెరాలకు పనిచెబుతుంటారు. ఓ రకంగా సెలబ్రిటీలకు ఆ క్రేజ్ ను తీసుకువచ్చేది వీరే అయినప్పటికీ ఒక్కోసారి సెలబ్రిటీల ఆగ్రహానికి గురికాకతప్పదు. ఇలాంటి ఘటనే బాలీవుడ్ లో చోటు చేసుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఫోటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య కరీనాతో కలిసి పార్టీకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సైఫ్ ను ఫోటోగ్రాఫర్లు కెమెరాకు పోజులివ్వమని కోరగా మా బెడ్ రూమ్ లోకి వచ్చేయండి అంటూ వ్యంగ్యంగా చురుకలు అంటించాడు సైఫ్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
విలేఖరులతో సైఫ్, కరీనాలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలా అని ఎప్పుడుపడితే అప్పుడు పోజులు ఇమ్మని అడిగితే..దీనికి ఓ హద్దు ఉంటుందంటూ నెటిజన్లు అంటున్నారు. సెలబ్రిటీల ప్రైవెసీకి భంగం కలిగించడం కరెక్ట్ కాదంటున్నారు.