డ్రైవర్‌పై సైఫ్ అలీఖాన్ జులుం.. - MicTv.in - Telugu News
mictv telugu

డ్రైవర్‌పై సైఫ్ అలీఖాన్ జులుం..

April 4, 2018

సెలబ్రిటీలకు బలుపు ఎక్కువైపోతోంది. తమ దగ్గర పనిచేసే నౌకర్లను కట్టుబానిసలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన డ్రైవర్‌పై అందరిముందూ దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కృష్ణజింకల వేట కేసు విచారణ కోసం సైఫ్ బుధవారం జోధ్ పూర్‌కు వచ్చాడు. సెలబ్రిటీ కాబట్టి విలేకర్లు అతని కారు చుట్టూ మూగారు. ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబు చెప్పడం ఈ హీరోగారికి ఇష్టం లేదు. నవాబు కూడా అయిన తనను అసలు విచారణకు పిలిపించడం ఏంటని అనుకున్నాడమో అతగాడు. విలేకర్లకు, జనానికి తన ముఖం కనబడకుండా కారు అద్దాలను మూసేయాలని, లేకపోతే కారును వెనక్కి తిప్పాలని డ్రైవర్‌కు చెప్పాడు. అది కూడా మామూలుగా చెప్పకుండా జులుం ప్రదర్శిస్తూ.. ‘కొడతా..’ అని జబర్దస్త్ చేశాడు.

సల్మాన్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో సైఫ్‌తో పాటు సోనాలి బెంద్రే, టాబూ, నీలం తదితులు సహనిందితులు. వీరంతా కలసి జింకను వేటాడారని పక్కా సాక్ష్యాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయతే వీరు ఎక్కడెక్కడో పావులు కదిలిస్తూ శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు.  కేసులో గురువారం కోర్టు తీర్పు ఇవ్వనుంది.