ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష(ఏఐఎస్ఎస్ఈ) వచ్చే ఏడాది 8వ తేదిన నిర్వహించనున్నారు.ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలవ్వగా మరోసారి పరీక్ష వివరాలను కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ్ కులకర్ణి తెలిపారు. మొత్తం 33 సైనిక్ పాఠశాలల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు అరుణ్ కులకర్ణి వెల్లడించారు. 6వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయస్సు 2023 మార్చి 31 నాటికి 10, 12 సంవత్సరాల మధ్య ఉండాలని, 9వ తరగతిలో ప్రవేశానికి 2023 మార్చి 31 నాటికి 13, 15 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. పరీక్ష రుసుం ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.650 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దరఖాస్తులను డిసెంబరు 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆన్లైన్లో పంపాలని కోరారు. ఇతర వివరాల కోసం Https://aissee. nta.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
సైనిక స్కూళ్లలో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023) నిర్వహిస్తుంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక ధారుడ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సైనిక స్కూళ్లతోపాటు 180 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కరీంనగర్, అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.