సెయింట్ కరోనా, నువ్వే కాపాడాల.. కేరళలో ప్రార్థనల వెల్లువ  - MicTv.in - Telugu News
mictv telugu

సెయింట్ కరోనా, నువ్వే కాపాడాల.. కేరళలో ప్రార్థనల వెల్లువ 

March 26, 2020

Saint corona story keralites prayers 

‘కరోనా తల్లీ.. నువ్వే మా ప్రాణాలను కాపాడాలి. మహిమాన్వితమైన ఈ శక్తితో ఆ వైరస్‌ను నిర్మూలించు. నీ పేరును మా పిల్లకు పెట్టుకుంటాం. నీ పేరుతో వేడకలు చేస్తాం.. పాహిమాం.. పాహిమాం, రక్షమాం రక్షమాం’ అని వేడుకుంటున్నారు కేరళీయులు. పెద్దసంఖ్యలో ఆమె దయ కోసం ప్రార్థనల నిర్వహిస్తున్నారు. కరోనా తల్లేంటి? వేడుకోవడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? 

ఇందులో వింతేమీ లేదు లెండి. కరోనా పేరుతో ప్రముఖ బీర్ ఉన్నట్లే క్రైస్తవ మతంలోనూ ఒక సెయింట్ కూడా ఉన్నారు. కరోనా భయంతో వణుకుతున్న కేరళ క్రైస్తవులు ఈ కష్టకాలంలో ఆమె ఫొటోలకు ప్రార్థనలు చేస్తున్నారు. కరోనా అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారని వారి నమ్మకం. క్రైస్తవం పురాణాల ప్రకారం.. కరోనా క్రీస్తుశకంలో రెండో శతాబ్దం రోమ్ సామ్రాజ్యంలో ఉండేవారు. అది క్రైస్తవులకు కష్టకాలం. విక్టర్ అనే సైనికుడు క్రైస్తవమతం పుచ్చుకోవడంతో నాటి రోమ్ చక్రవర్తి మార్కస్ అరీలియస్ అతని గుడ్లుపీకించి చిత్రహింస పెట్టాడు. ఆ సమయంలో మరో సైనికుడి భార్య అయిన కరోనా.. విక్టర్‌కు సేవ చేశారు. తర్వాత విక్టర్‌ను, కరోనానా దారుణంగా చంపేశారు. క్రైస్తవం కోసం వారిద్దరూ ప్రాణాలు ధారపోసినందుకు సెయిండ్ హుడ్ ప్రకటించారు. ఆస్ట్రియా, బవేరియా తదితర ప్రాంతాలో కరోనా భక్తులు ఉన్నారు. ఆమెను కొలిస్తే గుప్తనిధులు దొరుకుతాయని, డబ్బులు బాగా ఉంటాయని నమ్మకం.