2 కోట్ల ఆఫర్‌ను వదులుకున్న హైబ్రీడ్ పిల్ల - MicTv.in - Telugu News
mictv telugu

2 కోట్ల ఆఫర్‌ను వదులుకున్న హైబ్రీడ్ పిల్ల

April 15, 2019

సాయిపల్లవి ఇతర హీరోయిన్లకు భిన్నం హడావుడి లేకుండా తన పనేదో తాను చేసుకుపోతుంటుంది. పార్టీలకు, షాపుల ఓపెనింగులకు హాజరు కాదు, పెద్దగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోదు. కానీ తనజోలికి వస్తే మాత్రం తాట తీస్తుంది. తాజాగా ఆమె రూ. 2 కోట్ల ఆకర్షణీయ ఆఫర్ వదులుకుని మళ్లీ వార్తలకెక్కింది.

Saipallavi rejects two crore face cream company brand ambassador offer different form other actors

పలు హిట్ సినిమాలు ఉన్న సాయిపల్లవి ఇంతవరకూ ఒక్క వాణిజ్య ప్రకటనలోనూ నటించిన విషయం తెలిసిందే. కుర్రకారులో ఆమెకున్న ఫాలోయింగ్ గుర్తించిన ఫేస్ క్రీమ్ కంపెనీ ఒకటి ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని, రూ. 2 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అయితే దీనికి ఆమె నో చెప్పేసింది. ‘నేను సినిమాల్లోనే మేకప్‌ వేసుకోను. అలాంటిది.. అలాంటిది మీ ఫేస్‌ క్రీమ్‌ వాడమని ఎలా ప్రచారం చేస్తాను భయ్యా… ’ అని నిర్మొహమాటగా చెప్పేసిందట. ఫెయిర్ నెస్ క్రీముల యాడ్స్‌లో నటించే ప్రసక్తే లేదని కంగనా రనౌత్ వంటి హీరోయిన్లు కూడా స్పష్టం చేస్తున్నారు. అవి నల్లగా ఉన్నవారిని కించపరచేలా ఉంటాయని, తెల్లతోలు ఉండడం గొప్పకాదని, మనసు స్వచ్ఛంగా ఉంటే చాలని అంటున్నారు. ‘పడి పడి లేచె మనసు’ విడుదల తర్వాత సాయిపల్లవి  మరింత బిజీగా మారింది. తమిళంలో సూర్యకు జోడీగా ‘ఎన్జీకే’, రానాతో ‘విరాటపర్వం’ చిత్రాల్లో నటిస్తోంది.