సైరా.. నరసింహారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

సైరా.. నరసింహారెడ్డి

August 22, 2017

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ తాజా సినిమాకు ‘ సైరా నరసింహా రెడ్డి ’ పేరును ఖరారు చేశారు.  పేరులోనే యుద్ధానికి సై అన్నట్టుండటంతో సినిమా మీద చాలా ఆసక్తిని  క్రియేట్  అయింది. మంగళవారం చిరు  63 వ ( ఆగస్ట్ 22 ) పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. సినీ జక్కన్న రాజమౌళి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యటం విశేషం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చారిత్రక సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

రాయలసీమ జానపద గాయకులు పాడుకునే ‘సైరా.. నరసింహారెడ్డి.. నీ పేరే బంగారూకడ్డీ.. ’ అనే వీరగాథ నుంచి ఈ సినిమా టైటిల్ను తీసుకున్నారు.

బ్రిటిష్ పాలకులను ఎదిరించిన  రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా నయనతారను అనుకున్నారు. 151వ సినిమా కావడంతో మెగాస్టార్  ఈ సినిమా మీద చాలా శ్రద్ధ పెడుతున్నాడు.

40 ఏళ్ళ సినీ ప్రస్థానం

‘పునాది రాళ్ళు ’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన చిరు అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ స్థాయిని అందుకున్నారు. తన కెరీర్ లో రాత్రింబవళ్ళు కష్టపడి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన. 150 సినిమాల్లో హీరోగా నటించడం అంటే ఆశామాషీ వ్యవహారం అస్సలు కాదు. దానికెంతో ఓపిక, పట్టుదల, క్రమశిక్షణ చాలా అవసరమని చిరంజీవిని చూస్తే తెలిసిపోతుంది. డాన్సులు, డైలాగ్ డెలెవరీతో తనకంటూ ప్రత్యేక ఇమేజిని కైవసం చేసుకున్న నటుడు చిరంజీవి. ఇవాళ మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కుర్ర హీరోలకు, పవన్ కళ్యాణ్, నాగబాబులకు దిశానిర్దేశం చిరంజీవినే. ఆయన అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్. స్క్రీన్  నేమ్ అయిన చిరంజీవి అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసాడు.

తన కెరీర్లో చాలా గొప్ప గొప్ప సినిమాలొచ్చాయి. కుటుంబ కథా చిత్రాల్లోనే ఎక్కువగా నటించి మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపును తెచ్చుకున్నాడు. పద్మ భూషణ్ అవార్డు కూడా పొందాడు. ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేటును కూడా పొందాడు. రాజకీయాల్లో తనదైన ముద్రను వేసి కేంద్ర మంత్రిగా కూడా పదవిని అలంకరించారు. కొన్నేళ్ళ విరామం తర్వాత ‘ ఖైదీ నెంబర్ 150 ’ తో వచ్చాడు. ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్న సందర్భంలో మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆల్ ది బెస్ట్ చెబుదామా..

సైరా లో హేమాహేమీలు !

సైరా నరసింహారెడ్డి సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ను బయట పెట్టింది. తొలుత నుండీ ఈ సినిమాలో చిరంజీవియే ప్రధాన పాత్ర అవడంతో వన్ మేన్ ఆర్మీ షోలా అయిపోయింది.

ఈ చిత్రం టాపిక్ ఎప్పుడు వచ్చినా చిరంజీవి, సురేందర్ రెడ్డి, రాం చరణ్ పేర్లే ప్రముఖంగా విన్పించాయి. అయితే ఇక నుండీ ఈ సినిమాకు సంబంధించి ఇతర పేర్లు కూడా వినిపిస్తాయి. అమితా బచ్చన్ ప్రాముఖ్యమున్న పాత్రలో నటిస్తాడట. అలాగే ఈగ సుదీప్ కూడా కీలక పాత్రే చేస్తున్నాట్ట.

హీరోయిన్ గా నయనతారే ఖరారైనట్టు తెలుస్తోంది. అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతితో పాటు మన తెలుగు విలక్షణ నటుడు జగపతి బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ లో కన్పించనున్నారట. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రవి వర్మన్ కెమెరా మెన్ గా ఖరారైయ్యాడట. ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

నటీనటులతో సహా టెక్నీషియన్లు కూడా హేమా హేమీలే అవటంతో సైరా నరసింహారెడ్డికి మరింత హైపొచ్చేసింది. చూడాలి మరి సినిమా ఇప్పట్నుంచే జనాల్లో ఇంతగా నానుతుందంటే రేపు రిలీజయ్యాక ఇంకెంత నానుతుందో మరి.