జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. వైఎస్ జగన్ ని మరోసారి సీఎం కాకుండా ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. ఒకవేళ ఆపాలనుకుంటే ప్రజలే నిర్ణయం తీసుకోవాలని, ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు వద్దని వారు అనుకుంటే అప్పుడు మాత్రమే సీఎం కాకుండా ఆపడం కుదురుతుందని తెలిపారు.
ఎవరికి అధికారం ఇవ్వాలో ప్రజలే కానీ పవన్ కల్యాణ్ కాదన్నారు. పరిపక్వత లేని మూర్ఖత్వంతో ఎవరో ఇచ్చిన స్పీచును చదువుతున్న పవన్ కల్యాణ్ చంద్రబాబును ఒక్కమాట అనడం లేదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఉద్యోగాలపై పవన్ చేసిన ఆరోపణలపై మాట్లాడుతూ.. లక్షా 30 వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. అటు చంద్రబాబు హంతకుడైన బ్రహ్మా రెడ్డిని మాచర్లలో దించారని, ఆయన నిజస్వరూపం ఎంటో అర్ధం చేసుకోవాలని కోరారు. ఆరోజు పిన్నెల్లి సీఎంవో కార్యాలయంలో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రొవిజన్ లో ఉంది కాబట్టే వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వ భూములు కేటాయించామని చెప్పారు.