ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్

January 16, 2020

vgfg

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ ప్రెసిడెంట్‌‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సినీయర్‌ నేత సాకే శైలజనాథ్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పొందిన విషయం  తెలిసిందే. దీనికి బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆ పదవికి అప్పట్లో రాజీనామా చేశారు. 

గత కొంతకాలంగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన స్థానంలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరు చేపడతారు అనేది గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. సాకే శైలజానాథ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ, తులసి రెడ్డి, షేక్‌ మస్తాన్‌ వలీలను వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా కాంగ్రెస్‌ ఛీఫ్‌ సోనియా గాంధీ నియమించారు.