ప్రభుత్వంపై విరుచుకుపడిన ధోనీ భార్య.. ఎందుకంటే - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వంపై విరుచుకుపడిన ధోనీ భార్య.. ఎందుకంటే

April 26, 2022

 

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి ధోని విద్యుత్ కోతలపై జార్ఖండ్ ప్రభుత్వాన్ని విమర్శించింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఇంతలా ఎందుకున్నాయని ట్విట్టర్‌లో నిలదీసింది. ‘రాష్ట్ర వాసిగా, పన్నులు కడుతున్న పౌరురాలిగా ప్రభుత్వానికి ప్రశ్న వేస్తున్నా. గత కొంత కాలంగా విద్యుత్ సంక్షోభం రాష్ట్రంలో ఎందుకుందనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. బాధ్యత గల వ్యక్తిగా కరెంటును పొదుపుగా వాడుతున్నా. అయినా సమస్య పరిష్కారం కావటం లేదు’ అని ప్రశ్నించారు. కాగా, వేసవి మొదలైన నేపథ్యంలో కరెంటు కొరతతో సిబ్బంది గంటల తరబడి కోత పెడుతున్నారు. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు.