మీ సేవలకు సలాం.. చప్పట్లు కొట్టిన సీఎంలు, ప్రజలు - MicTv.in - Telugu News
mictv telugu

మీ సేవలకు సలాం.. చప్పట్లు కొట్టిన సీఎంలు, ప్రజలు

March 22, 2020

vv nvbn

‘వైద్యులూ, నర్సులూ, పోలీసులూ, అత్యవసర సిబ్బంది, పారిశుద్య కార్మికులారా మీకు వందనాలు.. మీ సేవలకు సలాములు’ అంటూ దేశవ్యాప్తంగా ప్రజలు వైద్యులు, నర్సులకు హ్యాట్సాఫ్ తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు అందరూ దీనికి మద్దతు పలికారు. ఎవరి ఇళ్లలో వారు ఉండి జనతా కర్ఫ్యూని విజయవంతం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, అత్యవసర సిబ్బందికి తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రముఖులు చప్పట్లు, శబ్దాలతో అభినందనలు, జోహార్లు తెలియజేశారు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసేవలందిస్తున్న వైద్యులకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సలాముల చేశారు. వారికి మరింత ఉత్సాహం కలిగించేలా ఇళ్ల బయటికి వచ్చి చప్పట్లు కొట్టారు. 

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో చప్పట్లు కొట్టి 24/7 సేవలు అందిస్తున్న వారికి అభినందనలు తెలిపారు. కేసీఆర్‌తో పాటు కుటుంబ సభ్యులు, మంత్రులు కూడా చప్పట్లు కొట్టారు. రాజ్‌భవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి బాల్కనీలో గవర్నర్‌ తమిళిసై చప్పట్లు కొట్టారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు, సెలబ్రిటీలు వారి ఇళ్ల ముందుకొచ్చి.. ఇంటి బాల్కనీల్లోకి వచ్చి చప్పట్లు, శబ్దాలతో అభినందించారు. టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, గోపీచంగ్, మంచు మోహన్ బాబు కుటుంబం, రాంచరణ్, పవన్ కల్యాణ్‌‌లు గంట కొట్టి ఉత్సాహం నింపారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, అత్యవసర సిబ్బందికి అభినందనలు తెలిపారు.