Salaar: Prabhas' LEAKED video from the sets creates a storm on the internet
mictv telugu

పాన్ ఇండియా మూవీ సలార్ మేకింగ్ వీడియో లీక్

September 25, 2022

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటోన్నా.. లీకుల బెడద తప్పట్లేదు. ఇంతకుముందే ఓ యాక్షన్ సీన్‌లో భాగంగా ప్రభాస్ గన్‌తో షూట్ చేస్తోన్న ఒక వీడియో లీకైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మేకింగ్ వీడియో బయటకొచ్చింది. ఒకవైపు కెమెరామెన్లు కెమెరాని సెట్ చేసే పనిలో ఉండగా.. మరోవైపు ప్రభాస్ స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తుండడాన్ని ఆ క్లిప్‌లో చూడొచ్చు.

ఈ వీడియో లీక్ అవ్వడమే ఆలస్యం.. అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. కొందరైతే తమకు నచ్చినట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేసుకొని, వీడియోకి మరిన్ని హంగులు తీర్చిదిద్దారు. అయితే.. వెంటనే అలర్ట్ అయిన చిత్రబృందం, సోషల్ మీడియా నుంచి లీకైన వీడియోని తొలగించే పనిలో నిమగ్నమైంది. అయితే, ఈలోపే జరగాల్సిన ఘోరమైతే జరిగిపోయింది. కాగా.. అటు కేజీఎఫ్‌తో సంచలనాలు నమోదు చేసిన ప్రశాంత్ నీల్, ఇటు పాన్ ఇండియా చిత్రాలతో సత్తా చాటుతోన్న ప్రభాస్ కాంబోలో ‘సలార్’ రూపొందుతుండడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.