Salaar: Prabhas, Prashanth Neel's film release date announced with new poster
mictv telugu

సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయిన కొత్త పోస్టర్

August 15, 2022

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆయన నటిస్తున్న `సలార్‌` టీమ్ క్రేజీ అప్డేట్ ఇచ్చంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. చెప్పినట్టుగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ అప్డేట్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందులో ప్రభాస్ కత్తి పట్టి నరికిన తీరు, ఆ శవాలు అలా పడి ఉండటం, రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టి చేస్తోన్న యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన పోస్టర్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు. ఇక ఇందులో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు.

టీమ్ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ‘సలార్ ఆగమనం‌’ అనే ట్యాగ్‌ సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ‘అన్న వస్తుండు..’ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది.

`సలార్‌` నుంచి ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్‌లు తప్ప మరే అప్‌డేట్‌ రాలేదు. మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు షూటింగ్‌ లొకేషన్‌ పిక్స్ లీక్‌ అయ్యాయి. ప్రభాస్‌ మాస్‌ లుక్‌కి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్‌డేట్ల కోసం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు అభిమానులు. అయినా స్పందించలేదు. ఎట్టకేలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా `సలార్‌` నుంచి క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు.