Sale of match tickets at Uppal Stadium from tomorrow
mictv telugu

ఉప్పల్‌లో క్రికెట్ మ్యాచ్.. రేపటి నుంచి టిక్కెట్ల విక్రయం.. ధర ఎంతంటే

September 14, 2022

Sale of match tickets at Uppal Stadium from tomorrow

దాదాపు రెండేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగబోతోంది. ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడే మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ నగరంలో జరుగనుంది. మూడు టీ20 మ్యాచుల సిరీస్ కోసం ఆసీస్ ఈ నెల 20న భారత్‌కు రానుంది. ఇందులో భాగంగా ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఖరారు చేశారు.

ఈ మ్యాచుకి సంబంధించిన టిక్కెట్లను గురువారం (సెప్టెంబర్ 15) నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. పేటీఎం ఇన్‌సైడర్ (ఆన్‌లైన్)ద్వారా టిక్కెట్లు విక్రయించనున్నారు. అదే విధంగా స్టేడియం వద్ద ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా కొనుగోలు చేసే వెసులుబాటును అభిమానుల కోసం కల్పించనున్నారు. ఇక ధరల విషయానికి వస్తే రూ. 800 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటికి జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్ధులకు ప్రత్యేక డిస్కౌంట్ ఉంటుంది. కాగా, ఈ సిరిస్‌లో తలపడే జట్టును భారత్ ఇంతకు ముందే ప్రకటించింది. ఈ సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది.