Salim Naik bit the snake with his mouth in odisha
mictv telugu

పాముపై పగబట్టిన మనిషి.. తల, తోక పట్టుకొని ఏం చేశాడంటే

September 8, 2022

తను కాటు వేసిన మనిషి పగతో ఓ పాము విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. కాటు వేసి తప్పించుకుందామని భావించిన ఆ పాము చివరకి ఆ వ్యక్తి చేతిలోనే బుధవారం బలైపోయింది. ఒడిశాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామానికి చెందిన సలీమ్ నాయక్ అనే వ్యక్తి తన పొలంలో తిరుగుతుండగా, తాచుపాము కాలిపై కాటు వేసింది. కాటు తర్వాత అక్కడ నుంచి పారిపోతున్న పాముపై ఆగ్రహం చెందిన సలీమ్.. ఆక్రోశంతో దాని వెంట పడి పట్టుకున్నాడు. తనను ఎలా కాటేసిందో అలాగే పామును కూడా కాటేసి చంపాలనుకుని తల, తోక రెండు చేతులతో పట్టుకున్నాడు. అనంతరం ఆ పామును మెడలో వేసుకొని నోటితో మిగిలిన భాగం ఎక్కడికక్కడ కొరికిపడేశాడు. మాంసం బయటపడేంత వరకు కొరకడంతో ఆ పాము బాధకు తాళలేక యాతనపడుతూ మరణించింది. చనిపోయిన తర్వాత పామును అలాగే తీసుకెళ్లి గ్రామంలో ఊరేగాడు. దీన్ని చూసిన గ్రామస్థులు నివ్వెరపోగా, సంప్రదాయం ప్రకారం పామును దహనం చేయకుండా ఖననం చేశాడు. అయితే పాము కరిచింది కదా ఎలాంటి చికిత్స తీసుకోవా? అని అడిగితే.. తాను పాము మంత్రం తెలిసిన తాంత్రికుడినని, సొంత వైద్యం చేసుకోగలనని నమ్మకం వ్యక్తం చేశాడు. అటు ఈ ఘటనపై వన్యప్రాణుల విభాగం ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.